టీచర్‌గా, సంఘ సేవా కార్యకర్తగా శ్రీమతి సుధామూర్తి గడించిన అనుభవాలను ఆమె మనతో ఈ పుస్తకంలో పంచుకొంటున్నారు. హాస్యం, సహజవివేకం నిండిన ఈ పుస్తకం ఆమె కృషిని, జీవన తత్త్వాన్ని తేటతెల్లంగా వెల్లడిస్తాయి.

జీవితపాఠాలతో వెలువడిన వైజ్‌ ఎండ్‌ అథర్‌వైజ్‌ ఇంగ్లీషు పుస్తకానికి అనువాద రూపమే జ్ఞానం-పరిజ్ఞానం. మన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నవారు తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది. - ఈనాడు

జీవితం చిన్నదే. అనుభవం సామాన్యమైనదే. అయితే ఎదురైన అనుభవాలను ఆత్మీయంగా ఆస్వాదించగిలిగినవాళ్ళకు ఆ జీవితమే ఆనందంగా, ఆ అనుభవమే అసామాన్యంగా పరిణమిస్తుంది. ఆదర్శాల అమృతభాండాన్ని ప్రసాదిస్తుంది. అందుకు తగిన చక్కని ఉదాహరణ ఈ జ్ఞానం-పరిజ్ఞానం. - ఇండియాటుడే

Write a review

Note: HTML is not translated!
Bad           Good