రుక్మిణి ఒక కథారచయిత్రిగా, వ్యాసకర్తఆ, మహిళా ఉద్యమకారిణిగా, వివిధ సామాజిక అంశాలపై స్పందించే ఆలోచనాపరురాలిగా బహుముఖాలుగా పరిణితి చెందడం వెనుక విరసానికి వున్న ప్రాపంచిక ధృక్పథంతోపాటు, ముఖ్యంగా మహిళా ఉద్యమాల స్ఫూర్తియే ముఖ్య కారణమనుకుంటాను. గత పదీ, పన్నెండేళ్ళుగా రుక్మిణి తన అనుభవాలను, ఆలోచనలను, విశ్లేషణలను విరివిగా రాస్తూ వుంది. అట్లా వివిధ పత్రికలలో రాసిన విప్లవోద్యమాలలో అమరులైన వారి జ్ఞాపకాలు, మహిళల సమస్యలు, ఉద్యమాలు, విభిన్న ధోరణులపై చేసిన విశ్లేషణలతో కూడిన వ్యాసాల సంకలనం ఇది. స్త్రీల సమస్యల పట్ల రుక్మిణికున్న ఆర్ది, జిజ్ఞాస ఈ వ్యాసాలన్నింటా ప్రముఖంగా కనిపించే అంశం!

Write a review

Note: HTML is not translated!
Bad           Good