Rs.60.00
In Stock
-
+
2005లో అశోక్‌కుమార్ రాసిన ఈ గుళికలు 'మానవ వికాసవేదిక' అనే మానవవాద (హ్యూమనిస్ట్) సంస్థ వారి పత్రిక 'మానవవికాసం'లో 2005 జూలై నుంచి 2006 జూలై వరకు అచ్చయ్యాయి. ఆనాడు పాఠకులు పలువురు ఆ గుళికలను ప్రశంసిస్తూ పత్రికకు ఉత్తరాలు కూడా రాశారు. హేతువాద ప్రచారానికి ఒక ఆధునిక కవితా రీఇని మేళవించి చెప్పడం కూడా ప్రతిస్పందనకు కారణం కావచ్చు.
'గుళికలు' అనే పదాన్ని వాడకంలోనే ఔచిత్యం వుంది. పొలాల్లో పైరులకు అంటిన చీడపీడలను తొలగించేందుకు వాడే రసాయనాలను కూడా రైతులు 'గుళికలు' అంటుంటారు. ఆయుర్వేద వైద్యంలో వుండే గుండ్రని మాత్రలను కూడా 'గుళిక' అనడం వుంది. ఆ పదాలన్నీ ఎవరు వాడినా, దానిపరమార్థం చెడును తొలగించటమే. పాఠకులమదిలో తిష్టవేసిన మౌఢ్యాన్ని తొలగించాలన్న వుద్దేశ్యంతోనే 'జ్ఞానగుళికలు' తయారైం వుంటాయి.
పేజీలు : 79