గ్లోబల్‌గా ప్రకృతులు వికృతులు ఉన్నయ్. ప్రకృతుల్లో విలువైన చదువు, వికృతుల్లో అమ్మకానికి చదువు, ప్రకృతుల్లో నైతికంగా డబ్బు, వికృతుల్లో "దొనెంబరీ". ఇలా గ్లోబల్ - లోకల్ కలిసి గ్లోకల్ అవుతుంది. గ్లోబల్ వాల్యూస్‌ని లోకల్‌గా ఆపాదిస్తే అది గ్లోకల్ అనుకోవచ్చు. అంటే గ్లోబల్‌గా సెక్స్ అత్యవసర వస్తువు అయితే లోకల్‌గా దాన్ని ఇన్‌డీసెంట్‌గా ఎలా ఏర్పాటు చేసుకోవాలి! అవసరం ఎలా తీర్చుకోవాలి...అవసరానికే కాదు అదో సరదా అవుతుంది. వృత్తిలో బైట పెట్టుకునే ప్రవృత్తి కూడా కావచ్చు! ఈ కొత్త వాల్యూ డెవలప్ అయిన చోటుని గ్లొకల్ విలేజ్ అనవచ్చు. అదన్నమాట! అలాగే ఇంగ్లీష్ గ్లోబల్‌గా ఎంత అవసరమో, లోకల్‌గా ఇంగ్లీషు స్కూలు నడిపేవాడికి తెలుస్తుంది. గ్లొబల్‌గా రియల్ ఎస్టేటు ఇండస్ట్రీస్ పెరుగుదల కావాలి. అన్నింటికి మించి సంస్కృతి ఎలా మారిపోతుంది అన్నది అర్ధంకాకుండానే మారిపోతుంది. ఎందుకంటే కొన్ని దేశాలతో మనం పోటీపడాలి. లోకల్‌గా వాటి విలువలు పెంచి వాటిని సాధించడానికి (అర్బనైజేషన్) పట్టణీకరణాల్ని మొదలు పెట్టాలి గ్రామాల్నించి వలసపోవడం, పట్టణ జీవితంలో ఏదో వుంది, అక్కడి ప్రజలు ఏదో జుర్రేసుకుంటున్నారు అన్న భ్రమ కలిగించడం భ్రమల్లో ప్రజలు కొట్టుకుపోయి, బ్రతుకుల్ని 'రేషను' పద్దతిలో జీవించడం, ఇదొక ప్రవాహంగా కొట్టుకుపోతోందేతప్ప, వొక్కోసారి వదిలేసుకున్న సహజవాతావరణాన్ని, ఆనందమయ జీవితాన్ని గురించి ఆలోచనే వుండదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good