క్షణంపాటు ఏంచేయాలో తోచలేదు వాత్సవకు.
అక్కడ దేవదారు చెట్టుకింద హకీం పరిస్థితి మృత్యుకోరల్లో చిక్కినట్టుంది. అతడ్ని చుట్టి దూరంగా కూర్చుని, నాలుక చాపుతూ లొట్టలు వేస్తూ అతడ్నే చూస్తున్నాయి డజనుకు పైగా తోడేళ్ళు.
మణిపూర్‌ అడవుల్లో తోడేళ్ళు చాలా ప్రమాదకరమైనవి. యూనిటీ వాటిలో వున్నంతగా ఎక్కడా కనబడదు. గుంపుగా జంతువుల్ని వేటాడి చంపి తినటం వాటి హాబీ. అయితే -
ఎలుగ్గొడ్లల్లో వుండే ఒక చిత్రమైన గుణం వీటిలో కూడా వుంది. కదలక మెదలక స్తబ్ధుగా వుండే జంతువుల జోలికి ఇవి వెళ్ళవు. అంటే చనిపోయిన జంతువుల్ని ఇవి తినవు. కాబట్టి వేటాడి చంపి తినటం అంటేనే వీటికి మక్కువ.
వీటి అలికిడికి హకీంభాయ్‌కి ఎప్పుడు మెలకువ వచ్చిందో గానీ చెట్టు మొదట్లో బాసిపట్టు వేసుకుని అపరబుద్దుడిలా కూర్చున్నాడు.
తోడేళ్ళ స్వభావం తెలిసినవాడు గావటం చేత ఊపిరి బిగపట్టి అచేతనంగా కూర్చుని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఓరగంట వాటిని గమనిస్తున్నాడు.
అతి బలిష్టమైన ఆ తోడేళ్ళు అతడు కాస్త కదిలినా చాలు, తోక నేలకు బాది, ఎగిరి మీదకు దూకటానికి చుట్టూ కాచుకుని రెడీగా ఉన్నాయి. అదృష్టం బాగుండి గాలి వాటు వ్యతిరేకదిశలో వుంది. లేకపోతే ఆ గుంపు మొత్తం ఇప్పుడు వాసన పసికట్టి తనమీదకు దూసుకొచ్చేది.
ఏదో ఒకటి చేసి అర్జెంటుగా హకీం భాయిని కాపాడాలి. లేకపోతే అన్యాయమైపోతాడు. అలా కదలకుండా ఎక్కువసేపు కూర్చోవటం సాధ్యం కాదు.
ఆపై సన్నివేశాన్ని ఊహించుకుంటే ఒళ్ళు జలదరిస్తున్నది కదూ! ఇలాంటి ఉత్కంఠ కలిగించే సన్నివేశాలెన్నో ఉన్నాయి శ్రీ మధుబాబు రాసిన నవల 'ఘర్షణ'లో.

Write a review

Note: HTML is not translated!
Bad           Good