ఘంటసాల మాస్టారు, నిజంగా తెలుగు సినిమా పాటకు మాస్టారు - అజరామరమైన ఆ గాత్రంతో అమృతపు సొనలు నింపిన వారి పాటలను తొమ్మిదింటిని ఈ ''ఘంటసాల నవరత్న గాన మాలిక'' అనే గ్రంథంలో, మన చిన మాస్టారు, నారాయణగారు అద్భుతంగా పొందుపరిచారు.

సినిమా పాటను దేవుడిలా ఆరాధించే సామాన్యులున్నారు, చాలా చిన్న చూపుచూసే విజ్ఞులనుకునే అవివేకులూ ఉన్నారు. ఏదో విధంగా ఈ గ్రంథం అందరికీ కరదీపిక కాగలదు. - బాలసుబ్రహ్మణ్యం

ఈ ప్రపంచంలో గ్రంథానికున్న స్ధానం చాలా విలువైనది. అందులో మన భారతీయ సంస్కృతిలో పండితులు, వాగ్గేయకారులు, గాయక సార్వభౌములకు చెందిన సంగీతపరమైన గ్రంథాలెన్నో మనకు అందుబాటులోకి వచ్చాయి. సినిమా పాటలకు సంబంధించి అనేకమంది సాహిత్యపరమైన చాలా గ్రంథాలు వెలువరించారు. అందులో ఘంటసాల వారి పాటల సాహిత్యగ్రంథాలు అనేకం మనకు లభ్యమవుతున్నాయి.

సాధారణంగా సినిమా సంగీతంలో ఎక్కువశాతం పాశ్చాత్య సంగీతపు నొటేషన్‌ విధానమునే అనుసరించడం జరుగుతుంది. కాని ఈ గ్రంథమును కర్ణాటక శాస్త్రీయ సంగీత గ్రంథరచన పద్ధతిని అనుసరించి వ్రాయడం జరిగినది. కర్ణాటక శాస్త్రీయసంగీతం వలె సినిమాసంగీతం లేదా లలితసంగీతం లక్ష్య, లక్షణ పరిమితులకు లోబడి ఉండడం అరుదు. అలా ఉండవలసిన అవసరం కూడా లేదనేది నా అభిప్రాయం. అటువంటి రాగలక్షన నిబంధనలు, తాళాంగ పరిమితులు లలితమైన భావావిష్కరణకు అవరోధం కాకూడదని మేధావులైన సంగీతకర్తలు స్వతంత్రించి వారు ఎన్నుకున్న స్వచ్ఛమైన రాగలక్షణములనే కాకుండా అన్యస్వర ప్రయోగాలతో పాటకు అదనపు అలంకారములను చేకూర్చారు. కొన్ని సందర్భాలలో శాస్త్రీయ సంగీత నేపథ్యంతో కూడిన కథలతో చిత్రాలలో సన్నివేశాలు అనుగుణంగా భక్తిపరమైన శాస్త్రీయ నిబంధనలతో కూడిన పాటలు మనకు చాలా ఉన్నాయి. అటువంటి వాటిలో అరుదైన పాటలను ఈ గ్రంథంలో ఎంపిక చేసుకోవడం జరిగింది. - బి.ఎ.నారాయణ 

Write a review

Note: HTML is not translated!
Bad           Good