20వ శతాబ్ధపు పూర్వార్ధంలోనే ఒక అపూర్వ సంగీత ప్రక్రియ రూపుదిద్దుకుంది. అదే 'లలిత సంగీత ప్రక్రియ'.

వ్యావహారిక భాషావాదం, భావకవితోద్యమాలు క్రమంగా బలపడుతున్న తరుణంలో ఎంతో గేయకవిత్వం రచింపబడింది. ఈ నూతన గేయ కవిత్వం గానం చేయడానికి అనువైన సంగీత ప్రక్రియ కూడా అవసరం అయింది. సంగీతంలోనూ, సాహిత్యంలోనూ రససిద్ధులైన కళాతపస్వులు ఈ ప్రక్రియకు జీవం పోసారు. ఈ సంగీత ప్రక్రియ శాస్త్రీయ సంగీతంతో సమాంతరంగా రేడియో మాధ్యమం ద్వారా ప్రచారం పొందుతూ అనేక రీతులుగా దినదిన ప్రవర్ధమానం అయింది.

తెలుగు ప్రజల అభిమాన గాయకుడిగా నేటికీ ధృవతారగా వెలుగొందుతున్న శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు రసికలోకానికి 20వ శతాబ్ధం ఉత్తరార్ధ ప్రారంభానికి కొంచెంద ముందుగా పరిచయం అయ్యారు. ఆయన సాధన చేసిన శాస్త్రీయ సంగీతం ప్రక్రియలో సిద్ధుడయినా, ఆయన పరిచయం అయినది లలిత సంగీత గానంతోనే. ఆకాశవాణీ లలితసంగీత కార్యక్రమాలలో ఆయన విరివిగా పాల్గొంటూ అనేక గీతాలు, పద్యాలు, లలిత సంగీత రీతిలో గ్రామఫోన్‌ రికార్డులుగా రూపొందించారు.

20వ శాతాబ్ధపు సంగీత చరిత్రలో ఈ నవతరం సంగీతరీతిని ఘంటసాల అధ్యాయంగా గుర్తించడం సమంజసం. తెలుగు సంస్కృతికి సంబంధించి శ్రీ ఘంటసాల సంగీతబాణీ అజరామరంగా నిలుస్తుంది తెలుగునాట.

మాన్యశ్రీ ఘంటసాల అర్ధాంగి సావిత్రమ్మ గారు ఘంటసాల జ్ఞాపకాలు ను గ్రంధరూపంలో అందించారు. ఈ జ్ఞాపకాలను నివేదించడంలో రచయిత్రి తీసుకున్న శ్రద్ధాసక్తులు ఈ పుస్తకంలో మనం ప్రశంసనీయంగా గుర్తించగలం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good