హెమింగ్వే రచనల్లో సుదీర్ఘమైన నవల ''ఫర్‌ హూమ్‌ ది బెల్‌ టోల్స్‌''. స్పెయిన్‌లో ఫాసిస్టులకూ, కమ్యూనిస్టులకూ జరిగిన సంఘర్షణ ఇందులోని వృత్తాంతం. నాలుగు దినాలలో నడిచిన ఘటనలు నాలుగువందల ముప్ఫైఅయిదు పుటలలో చిత్రించాడు. ఒక గుహలో కొద్దిమంది స్త్రీ పురుషులతో కథ నడిచినప్పటికీ మొత్తం ఉద్యమమంతా మన కళ్ళముందు కదులుతున్నట్లనిపిస్తుంది. ఫాసిస్టుల కిరాతక చర్యలతోపాటుగా, విప్లవకారుల అమానుష కృత్యాలు వర్ణించటంలో హెమింగ్వే ప్రదర్శించిన నిష్పాక్షిక నిర్లిప్తదృష్టి ఉత్తమ రచయితలకే సాధ్యమౌతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good