కొన్ని రచనలకు కాలదోషం వుండదు.
అ లెగ్జాండర్ ద్యుమా నూటయాభై ఏళ్లనాడు రచించన 'అజేయుడు' ఇప్పటికీ అజేయంగా పాఠకుల్ని
అ లరిస్తూనే వుంది.
కథానాయకుడి వీరోచిత వ్యక్తిత్వం హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అనేకానేక పాత్రలకు స్ఫూర్తినిచ్చింది.
అ లనాటి ఫ్రెంచి సమాజాన్నీ, రాజకీయాల్నీ కళ్లకు కట్టే రచన ఇది. అరవై అయిదేళ్ల క్రితం సూరంపూడి సీతారాం
తెలుగులోకి అనువదించారు.హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు క్లుప్తీకరించి అందిస్తున్నారు.
పదిహేనవ శతాబ్దపు 'పారిస్ నగరాన్ని పునరుజ్జీవింపచేసిన మరో నవల ''హంచ్బాక్ ఆఫ్ నోత్రెదామ్''.
దీన్ని 'ఘంటారావం' పేరుతో సీతారాం తెలుగు చేశారు.
ఈ రెండు పుస్తకాలనీ చదవడం గొప్ప అనుభూతి.
- స్వామి (ఈనాడు ఆదివారం)

Write a review

Note: HTML is not translated!
Bad           Good