స్థూలంగా సాహిత్యంలో విషయాన్ని ఆత్మాశ్రయం, వస్త్వాశ్రయం అనే రెండు పాయలుగా విడగొడతారు. ఆత్మాశ్రయం వ్యక్తికి సంబంధించింది; వస్త్వాశ్రయం బాహ్య సమాజానికి సంబంధించింది. దేశమంటే మట్టి కాదు, మనుషులే అన్న గురజాడ దగ్గరనుంచి సాహిత్యంలో సామాజికచైతన్యానికే పెద్దపీట వేశారు. వైయక్తిక అనుభూతులు తక్కువ. ఇందుకు వామపక్ష భావజాలం, రకరకాల సామాజిక ఉద్యమాల ప్రభావం ప్రధాన కారణాలు. ఈ ధోరణి తప్పని చెప్పటం నా ఉద్దేశం కాదు. అయితే అదే సమయంలో మనిషి బ్రతుకులో తడమాల్సిన, అందించాల్సిన, జొరబడాల్సిన అంశాలెన్నో ఉంటాయి. వ్యక్తిగత కామనలుంటాయి. సందిగ్ధతలుంటాయి. సుడిగుండాలుంటాయి. స్నేహగీతాలుంటాయి. వలపు పిలుపులుంటాయి. తాత్త్వికశోధనలుంటాయి. అన్నీ కలిసిందే జీవితం. కనుక ఈ అంశాలు వేటినీ నిర్లక్ష్యం చెయ్యనక్కర్లేదు అని చెప్పటమే నా ఉద్దేశం.

అందువల్లనే ఈ పొత్తంలో మూడు ప్రణయగీతాలు చోటు చేసుకొన్నాయి. అవి మూడు వలపుగత్తెల కూరిమి పలుకులే కావటం యాదృచ్ఛికం. 'కలత నిదర' (నండూరి) సున్నితమైన విరహభావానికి అక్షరరూపం. ఈ రేయి మామతో కలవకపోతే ఎన్నెలల సొగసంతా ఏటిపాలేనని బాధపడుతుంది యెంకి. ఆ రేయి ఆమెది జాగారమే. 'గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!' పాట (బసవరాజు) మరదలి చిలిపితనపు చిన్నె. ఆ కూరలో తన వలపంతా కూరి పెట్టింది ఆ వెఱ్ఱిపిల్ల. ఇక 'మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకొ'మ్మంటుంది బంగారిమామతో ర్పఏయసి (కొనకళ్ల). ఇది జానపద ఫక్కిలో గ్రామీణ శృంగారం. ఇటువంటి పాటలు ఏ సంకలనానికైనా అలంకారాలే గదా! అట్లాగే స్నేహమాధుర్యం తెల్పుతూ 'సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్‌' అని ఇంద్రగంటి నిరూపిస్తే, 'మిత్రుడే కావాలి సుఖమున, శోకాన / అతడు లేకున్నచో నగరమే కాన' అంటున్నాడు దాశరథి. ''కలలండీ కలలూ' అని కలల బేహారి (అమరేంద్ర) పిలుస్తున్నప్పుడు అక్కడ 'బాధలన్ని మరపించే మాధుర్యపు తళతళలు' కనుగొంటా..... - పాపినేని శివశంకర్‌

పేజీలు : 207

Write a review

Note: HTML is not translated!
Bad           Good