1850 వేసవిలో, 1848-1849 విప్లవం ఓడిపోయిన తర్వాత ఎంగెల్సు 'జర్మనీలో రైతు యుద్ధం' రచించినాడు. ఆ విప్లవాన్ని లోతుగా అధ్యయనం చేసి చారిత్రక అనుభవాలను క్రోడీకరించిన ఫలితంగా మార్క్సు, ఎంగెల్సులు ప్రతిపాదించిన అత్యంత ముఖ్యమైన భావాలు, ఆ కాలంలో మార్క్సిజం స్ధాపకులు రచించిన యిత అసాధారణ గ్రంథాలలో వున్నట్లే, దీనిలో ఉన్నాయి.
1525లో జర్మన్‌ రైతులూ, సామాన్యులూ చేసిన శక్తివంతమైన తిరుగుబాటు యొక్క చరిత్రను గురిచి చెబుతుంది 'జర్మనీలో రైతు యుద్ధం'. యీ తిరుగుబాటును 'జర్మన్‌ చరిత్రలో అత్యంత మౌలికమైన ఘటన' అని 1844లో మార్క్సు వర్ణించినాడు. జర్మనీలో తొలి విప్లవం యొక్క - 16వ శతాబ్ది తొలి భాగంలోని రెఫర్మేషన్‌యొక్క - శిఖర దశ అది. ప్రగతి వ్యతిరేక ఫ్యూడల్‌ శక్తులు, మధ్యయుగ కాథలిక్‌ మతవ్యవస్థతో సహా, జర్మనీలో పెట్టుబడిదారీ సంబంధాల పెరుగుదలను నిదానపరిచి, కేంద్రీకృత జర్మన్‌ రాజ్య నిర్మాణానికి అడ్డుపడినాయి; వాటికి వ్యతిరేకంగా జరిగింది రెఫర్మేషన్‌. 1525లో రైతుల, సామాన్యుల ఓటమి జర్మనీలో తొలి కాలపు బూర్జువా వైఫల్యానికి దారితీసింది. వీరికి జర్మన్‌ పట్టణ వాసులు తిరుగుబాటు చేసిన రైతాంగానికి ద్రోహం చేసి, ఫ్యూడల్‌ ప్రభువర్గ పక్షానికి పోయినారు. తత్ఫలితంగా లూతర్‌ రెఫర్మేషన్‌ లౌకిక ఫ్యూడల్‌ రాజుల ప్రయోజనాలకు అనుగుణంగా మారింది. జర్మనీ ఆర్ధికంగానూ, రాజకీయంగానూ ముక్కలు ముక్కలుగానే నిలిచిపోయింది.
చరిత్రలో యెప్పుడైనా క్రియాత్మకంగా వుండే పీడిత వర్గాలలోకెల్ల కార్మికవర్గం - పెట్టుబడిదారీ వ్యవస్థ మారకుడు, నూతన సోషలిస్టు సమాజ నిర్మాత - ఒక్కటే దోపి చేయబడే, పీడిత వర్గాల కన్నిటికీ నాయకుడుగా, ముక్తిదాతగా వుండే మహత్తర చారిత్ర కర్తవ్యాన్ని నిర్వహించడానికి నియుక్తమైన నిజమైన విప్లవకర వర్గం అనే మౌలిక మార్క్సిస్టు నిర్ణయాన్ని 'జర్మనీలో రైతు యుద్ధం' ధ్రుపపరుస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good