13వ శతాబ్ధపు మంగోల్ ప్రాంతం ఒక అనాగరిక గ్రామీణ మైదాన ప్రాంతం. ఎన్నో తండాలు తమ పశువులు పెంచుకుంటూ పశు గ్రాసం కరువైనప్పుడు తండాలుగా ప్రయాణించి మరో పచ్చికబయళ్లను ఆక్రమించేవి. ఆ సమయంలో ఆ తండాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగేవి. అందులో ఎందరో మరణించేవారు.

అలాటి ఒక చిన్న తండా నాయకుడి కుమారుడిగా 'టెముజిన్' పేరుతో జన్మించి తన గ్రామీణ జీవన విధానం నిశితంగా పరిశీలించి 12వ ఏట తండ్రి మరణించగా అతడి వారసత్వం స్వీకరించి నయానో, భయానో వివిధ మంగోల్ తండాలను ఏకం చేసి మంగోల్ తండాల ఏకైక నాయకుడై ఖాన్‌లకు ఖాన్‌గా 'చెంఘిజ్ ఖాన్' బిరుదు వహించి తన ఇరుగు పొరుగు నాగరిక దేశాల వైపు దృష్టి సారించాడు. తన శక్తి సామర్థ్యాలతో ఒకవైపు దక్షిణ చైనాను, మరో దిక్కున గల ఇప్పటి ఇరాన్ వరకు, మరోవైపు తుర్కిస్తాన్ వరకు తన వీరోచిత యుద్ధనైపుణ్యంతో మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు.

50 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలతో జగజ్జేతగా నిలిచి తన వారసులును కూడా క్రమశిక్షణలో ఉంచి తను స్థాపించిన సామ్రాజ్యం 150 సంవత్సరాలు సుస్థిరంగా ఉండటానికి కారణభూతుడై మంగోల్ ప్రజలకు చరిత్రలో సుస్థిర స్థానం మిగిల్చిన వీరాధివీరుడు 'చెంఘిజ్ ఖాన్'. మతం గురించి 'చెంఘిజ్ ఖాన్' అభిప్రాయాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good