జి.కు. జనరల్ అవేర్ నెస్ మొదలైన వివిధ సబ్జెక్టు లకు సంబంధించిన అనేక పోటీ పరీక్షలలో ప్రశ్నలు ఎదుర్కోవలసి వుంటుంది. సైన్సు, ఆర్ట్, విద్యార్ధులకు పరీక్షార్ధులకు బిట్స్ ను పలు కోణాలలో అధ్యయనం చేయవలసి వుంటుంది. మల్టిపుల్ లేదా ఆబ్జెక్టివ్ ప్రశ్నల జవాబులకు, అర్ధం చేసుకుని చదివితే విజయం మన గుప్పిట్లో ఇమిడుతుంది. కష్టపడి చదవగలిగే మనస్తత్వం ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకునే అలవాటును పెంపొందించు కుంటే నైపుణ్యాలు వాటంతటవే మనలో స్థిరపడతాయి. వీటిని య్హేవారికి వారే సొంతంగా మెరుగుపరచుకోవాలి. పోటీపరీక్షలకు హాజరయ్యే , విద్యార్ధులకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన జనరల్ నాలెడ్జ్ సీరిస్ లో వివిధ సబ్జెక్టు లకు సంబందించిన ఆబ్జెక్టివ్ బిట్స్ పుస్తకాల ద్వారా అందింస్తున్నాం.జనరల్ స్టడీస్ , ఫిజిక్స్ , జేవ శాస్త్రం, చరిత్ర, భూగోల శాస్త్రం, కెమిస్ట్రీ , పాలిటిక్స్ తెలుగు, సైన్సు అండ్ టెక్నాలజీ , గణితం, ఎకానమీ .మొదలైన వివిధ సబ్జక్ట్స్ లకు సంబంధించిన ఆబ్జెక్టివ్ బిట్స్ పరీక్ష అభ్యర్ధులకు అవసరమైన ముఖ్య సూచనలు కూడా జతపరుస్తున్నాం.