''గెలుపుసరే బతకడం ఎలా'' అనేది కెరీర్‌ గైడెన్స్‌ పేరిట వస్తున్న రచనలు, ఉద్బోధిస్తున్న విషయాల పట్ల పరమకోపంతో విచిత్రమైన ప్రక్రియలో సాగిన రచన. ఎలా ఉండాలో చెప్పడం ఒక పద్ధతి. ఎలా ఉండకూడదో నేర్పడం ఇంకో పద్ధతి. 'ఇలా జీవించడం నాకు వ్యక్తిగతంగా ఇష్టంలేదు' అంటూనే ఎలా ఉండకూడదో, అల ఉంటేనే ఇప్పుడు జరుగు బాటుంటోందని కనిపించని వ్యంగ్యంతో రాసిన రచన ఇది. ఏ ప్రక్రియకీ వొంగనిది. - ప్రసాద్‌ వర్మ, సురేష్‌

ఇప్పుడు మళ్ళీ ఈ పుస్తకం 'గెలుపు సరే' చదువుతుంటే నా తప్పు నాకు తెలిసింది. ఇప్పుడు నే చదవక పోతే జన్మలో నా తప్పు నాకు తెలిసేది కాదు. నా తప్పు, రోజూ చదవవలసిన పుస్తకం ఇన్నాళ్ళూ చదవక పోవడం. నిత్యమూ చదవక పోవడం వల్ల బతికేందుకు కావలసిన మూల ధాతువును గ్రహించలేక పోవడం. ఇప్పట్నించీ ఈ పరమ సత్యాలు మననం చేసుకోవాలి. అన్నీ గ్రహణలోకి తెచ్చుకుని స్వీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. జీవితంలో లోపాలను గ్రహించడమే తొలి విజయం. సరి దిద్దుకుంటూ సాధించిన పరిణామాన్ని ఎదుటివాళ్ళు గ్రహించడమే అంతిమ విజయం. - కొమ్మన రాధాకృష్ణారావు

గెలుపుసరే, బ్రతకడం ఎలా? అనే ఒక ప్రశ్నతో పతంజలి మార్కు తార్కిక, వ్యంగ్య, అధిక్షేప నచో వైభవంతో గెలుపు సూత్రాలను కాకుండా బతుకు సూత్రాలను రచించాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని అనేక రకాల గురువులు ఆక్రమించి ఉన్నారు. కుల, మత, సాంస్కృతిక, రాజకీయ, కార్పోరేట్‌ గురువుల చేతుల్లో పడి సామాజిక కూర్పు అంతా అస్తవ్యస్తమైపోతున్న తరుణంలో, గెలుపే జీవితంగా ఓటమి మరణంగా వ్యాఖ్యానితమవుతున్న దశలో పతంజలి ఒక భిన్నమైన కోణం నుంచి జీవితాన్ని వ్యాఖ్యానించిన పుస్తకం ఇది. 1980ల నాటికే మన జీవితాల చుట్టూ కార్పోరేట్‌ గురువులు మోహరించి ఉన్నారు. రాను రాను ఈ గురుకుల సంఖ్య అధికమైంది. కార్పోరేట్‌ గురువుల సంఖ్య పెరిగే కొద్దీ, ఆధ్యాత్మిక గురువుల సంఖ్య కూడా తామరతంపరగా పెరిగిపోయింది. ఎక్కడ ఎటుచూసినా వచన ప్రవచనాలే, ఎటు చెవి వొగ్గినా అభిభాషణలే. అనుగ్రహ భాషణములే వర్ధిల్లిపోయాయి. - సీతారామ్‌

పేజీలు : 117

Write a review

Note: HTML is not translated!
Bad           Good