ఈ పుస్తకం... ఇందుకు!

విజయం, గెలుపు... జీవరాసులన్నింటిలో అంతర్లీనమైన జీవన ఆరాటం మరియు జీవిత పోరాటం గెలుపు కోసమే.

ఏ భాషలో అయినా! ఏ భావంలో అయినా! జీవనాధారం అయి అందరికీ, ప్రీతిపాత్రమైన, శ్రవణప్రియమైన, మంగళకరమైన పదాలు ''గెలుపు'' ''విజయం''!

గెలుపు కోసమే జీవిస్తూ, గెలుపుకోసమే మరణిస్తూ, గెలుపు అనే ఆధారాన్ని పట్టుకుని అపురూపంగా ప్రయాణాన్ని సాగించే వారే అందరూ... గెలుపునే శ్వాసగా, అణుక్షణం ఈ గెలుపుకై తపిస్తూ జీవనాన్ని సాగించేవారు ఎందరెందరో! మానవ మనుగడయే గెలుపు అయినప్పుడు ఆ గెలుపుకోసం వేలకొద్ది పుస్తకాలు ప్రచురించబడ్డాయి... ప్రచురించ బడుతున్నాయి కూడా! మన తెలుగులో కూడా ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాలున్నాయి.

అయితే దాదాపు ఆ పుస్తకాలు అన్నీ కూడా గెలుపు యొక్క వైభవాన్ని వివరించాయి, ఆవశ్యకతను చాటి చెప్పాయి. గెలవడానికి ఏమి చేయాలో మాత్రమే తెలిపి! గెలుపు యొక్క సమగ్ర కోణాన్ని వివరించ లేక పోయాయి. గెలుపుచుట్టూ అంతా ఆనందమే కాదు బాధ కూడా ఉంటుంది. విజయాన్ని పొందిన ప్రతివారు ఆచరించే పద్ధతి ఒకేలా ఉంటుంది అనుకోలేము. అది అనైతికము కూడా అయివుండవచ్చు. గెలుపొందిన ప్రతివారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు అని కూడా చెప్పలేము.

ఆశయం కోసమే గెలిచినా! పరిస్థితుల ప్రభావం, దురాశ వల్ల ఆశయానికి తిలోదకాలు ఇచ్చి స్వార్థంతో గెలుపు ఫలాలని తన స్వలాభానికి మాత్రమే వాడుకోవచ్చు. అహంకారంతో వూరేగుతూ... అధర్మంతో చెలరేగుతూ... గెలుపు స్థానంలో తర్వాత కాలంలో ఓటమిని చవిచూసిన వారెందరో నేటి సమాజంలో ఉన్నారు! ఎన్నో... ఎన్నెన్నో... దుష్పరిణామాలు గెలుపు చుట్టూ పెనవేసుకుని ఉంటాయి.

గెలుపు అవగాహన, గెలుపు ప్రయాణం, గెలుపు అర్థం, గెలుపు అనర్థం మరియు గెలుపు పరమార్థం లాంటి ఐదు ప్రధాన భాగాలుగా గెలుపు పిలుపును విభజించి గెలుపులోని మూల సూత్రాన్ని మీకు అందించే ప్రయత్నమే ఈ ''గెలుపు మలుపు''.

పేజీలు : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good