అనగనగా ప్రేమ సముద్రంలో ఒక షిప్పు ! అదే లవ్‌... హేట్‌ రిలేషన్‌షిప్‌ ! ఆ షిప్పులో ఓ జంట !

ఆమె పెళ్ళి చూపులనుకుంది. చదువులేని ఆడపిల్లకి తన హృదయంలో చోటులేదని అనాలోచితంగా అన్నాడతను. ఆ నిరసనతో ఆమెలో ఛాలెంజీ జ్వాలలు ప్రజ్వరిల్లేయి.  మారుతున్న సమాజంలో ఆడపిల్లకి అర్థం ఏమిటో చెప్పాలని పంతం పట్టింది. చదువు ప్రారంభించింది. బ్రిలియంట్‌ స్టూడెంట్‌గా, మోస్ట్‌ మోడ్రన్‌గాళ్‌గా పదుగురి ముందూ నిలిచింది. ఆమె వున్న క్లాసుకే అతను లెక్చరర్‌గా వచ్చాడు. అతన్నామె గుర్తించింది. అతని గుండెల్లె కితకితలు పెట్టింది, కవ్వించింది, అతన్ని ముగ్గులోకి దించి, సుందర ప్రేమకాండకి కథానాయకుడ్ని చేసింది. విరహాగ్నిలో పడేసింది. ఇక వాళ్ళ షిప్పు రసవత్తర తరంగాల్లో చిక్కుకుంది.

ఆ ప్రేమ నావ అనురాగ దీవికి ఆనందంగా చేరిన వైనమే గెలుపు నాదే !

ఇంతేగాక ఇందులో చదువుకునేందుకు మిమ్మల్ని మెరిపించే మురిపించే ఆరు మంచి ముత్యాల్లాంటి కథలున్నాయి కూడా...

పేజీలు : 147

Write a review

Note: HTML is not translated!
Bad           Good