ఓ అర్చకా! తలుపులన్నీ మూసుకుని, ఈ దేవాలయపు

చీకటి పరదాలో ఎవరి కోసం నీకు పూజిస్తున్నావు?

కళ్ళు తెరచి చూడు. నీవు ఎవరిని ఆరాధిస్తున్నావో,

అతడు నీ ముందు లేడు. నీ జపాలు, తపాలు, కీర్తనలు

విడనాడి రా.


నీవు వెతికే నాధుడు ఎక్కడ ఉన్నాడో పరికించు.

రాతినేల దున్నుతున్న రైతు చెంత, నడవడానికి 

బాట వేసే రాల్లుకొడుతున్న కూలీ ముందు అతను ఉన్నాడు.

శ్రమజీవులతో ఉన్నాడు. అతని దుస్తులు కూడా దుమ్ము కొట్టుకుని

ఉన్నాయి.


నీవు కూడా అతనిలా దుమ్ము ధూసరమైన నేలపైకి రా,

నీ మడి బట్టలు అవతల పెట్టి మరీ రా.


మోక్షం! ఎక్కడుందీ మోక్షం? ఈశుడే ఆనందంగా

ఈ సృష్టి బంధనాన్ని స్వీకరించి మోస్తున్నాడు.

శాశ్వతంగా మనతో కట్టుబడి ఉన్నాడు తాను.


ఓ అర్చకా! నీ జపాలు తపాలు ధ్యానాలు నుండి బయటకు రా.

పూలను ధపదీప నైవేద్యాలను అవతలపెట్టు.

నీవు ధరించిన దుకూలాలు మాస్తేనేమి, పీలికలైతేనేమి?

అతనితో నిలచి చెమటోడ్చి కష్టపడు

పేజీలు : 122

Write a review

Note: HTML is not translated!
Bad           Good