గేదె మీది పిట్ట
అతని ముఖం గడ్డం కింద కొంచెం ముదిరింది. చెంపల దగ్గిర అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు ఆశ్చర్యార్థకాల్లాగ కనిపిస్తున్నాయి. కొంచెం రంగు వేసుకోవాలి. పరీక్షగా చూసుకున్నాడు ప్రకాష్. జుట్టు కొంచెం పలచబడింది. పొట్టలేదు. (''ఇన్నేళ్ల నుంచీ అట్లాగే ఉన్నావు బాస్''). తలమీద కూడా రెండు మూడుచోట్ల తెల్ల మొలకలు. కళ్లలోకి పరీక్షగా చూసుకున్నాడతను. బాగనే ఉన్నాయి. నిశ్శబ్దంగా ఉన్నాయి. ఏవీ అనడం లేదు. పళ్లు కూడా తళతళలాడ్డం లేదు గానీ శుభ్రంగా ఉన్నాయి. నురుగు గడ్డానికి పెట్టుకున్నాడు. జాగ్రత్తగా, సున్నితంగా గడ్డం గీసుకున&వఆనడతను. నున్నగా ఉంది. మళ్లీ నురుగు పెట్టి మళ్లీ నున్నగా గీసుకున్నాడు. గడ్డానికి కమ్మటి లోషను పూసుకున్నాడు ఆదిప్రకాష్.
ఎవరో తరిమినట్టు, బాణం విడిచినట్లు బూడిదరంగు పిట్ట గేదె వీపు మీద వాలింది.
గేదె వీపు కొంచెం పులకరించింది. గేదె నడుస్తోంది.
పిట్ట నుంచుని చుట్టూరా చూసుకుంటోంది. గేదె వీపు మీద చిన్న పురుగుల కోసం వెతుక్కుంది. గేదె నడుస్తోంది.
కాసేపయిన తరువాత పిట్ట రివ్వుమని ఎగిరిపోయింది.
చెట్లకింద నుంచి దవడలు చప్పరిస్తూ ఆలోచచిస్తూ గేదెల వరస.
బూడిదరంగు పిట్ట గేదె మీద వాలింది.
పిట్ట ముక్కుతో గేదె వీపు వెతికింది.
కిచకిచమంది.....