గయోపాఖ్యానము ప్రథమాంకము
రంగము : యమునా తీరమందలి బృందావనము (సాత్యకి ప్రవేశించుచున్నాడు)
సాత్యకి - (తనలో) పూజ్యుడగు శ్రీకృష్ణుడు నిన్న సాయంకాలము నన్నుంజేనబిలిచి ''వత్సా సాత్యకీ! రేపు ఉదయమున మనము కాలిందీ జలంబున భగవానుండగు భ్రాకరున కర్ఘ్య మొసంగి యనంతరము జలక్రీడామ¬త్సవ మను భవింపవలయు గావున నీవు నేటి రేయి నాల్గవజామున మేలుకాంచి, జలభద్రాదుల మేలుకొలిపి వలయు సన్నాహము చేయునది'' యని సెలవిచ్చె. ఆ మహాత్ముని యాజ్ఞాబలమే నన్ను యథాకాల ప్రబోధఙతుని జేసినది ఇక నాలుగు గడియలలో దెల్లవాఱగలదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good