నీవు నన్ను

నీవు నన్ను ప్రేమిస్తే సగం జగం వీడిదే.
నీవు నన్ను కాదంటే జగమంతా బూడిదే

నిన్ను తప్ప నా కన్ను ఇంకేదీచూడదే
నీవు నన్ను విరహంతో బాధపెట్టకూడదే

నీతో ఆ పాతాళం నా పాలిటి స్వర్గమే
నీవులేని వైకుంఠం పాడుపడిన దుర్గమే

నీవు నన్ను వలదన్నా ప్రేమ నినువీడదే
నీవు నన్ను విడిచినచో నాకు ఊపిరాడదే

Write a review

Note: HTML is not translated!
Bad           Good