పరీక్షల కోసమే బోధన, పరీక్షల కోసమే నేర్చుకోవడం మొత్తం విద్యా వ్యవస్థనే పరీక్షా వ్యవస్థగా మార్చింది, ఎంత ఎక్కువ విషయాలను నేర్పే ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ నాణ్యత అనే అపోహలో తక్కువ విషయాలనైనా సంపూర్ణంగా, సమగ్రంగా నేర్చుకోఎవాలనే సంస్కృతిని కోల్పోయాం. నేర్చుకునే విషయానికి, సామర్థ్యానికి గాక డిగ్రీలకు ప్రాధాన్యత పెరిగింది. సహకార భావం స్థానంలో పోటీతత్వం, వైయక్తిక భేదాలకనుగుణమైన విద్య గాక అందరికీ ఒకేరకమైన ప్రమాణాలతో కూడిన విద్య, హక్కుగా పొందవలసిన విద్య డబ్బుతో ముడిపడడం, నమ్మకం ఆధారంగా కొలవలసిన టీచర్ల పని తీరును పరీక్షా ఫలితాల ఆధారంగా కొలవడం జరుగుతున్నాయి. ప్రజాస్వామిక విలువలతో మనిషిని తయారుచేసే విద్య కోసం అంతరాలు, దొంతరలు లేని విద్యావ్యవస్థను రూపొందించుకోవడంలో విఫలమయ్యాయి. ఈ విఫలమైన పనిని సాకారం చేసే పనిలో ఈ పుస్తకం ఏమాత్రం ఉపయోగపడినా దాని ప్రయోజనం నెరవేరినట్లే.

పేజీలు :216

Write a review

Note: HTML is not translated!
Bad           Good