నక్సల్బరీ వసంత మేఘగర్జన సి.పి.ఐ. (ఎం.ఎల్‌) ఆవిర్భావానికి దారి తీసినట్టే జగిత్యాల జైత్రయాత్ర సిరిసిల్ల-కరీంనగర్‌ రైతాంగ పోరాటాలుగా, ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటాలుగా పురోగమించి 1980 ఏప్రిల్‌ 22న సి.పి.ఐ. (ఎం.ఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడడానికి దారితీసింది. పీపుల్స్‌వార్‌ రచించిన దండకారణ్య పరస్పెక్టివ్‌ వెలుగులో విప్లవోద్యమ వస్తిరణ విముక్తి ప్రాంతాల నిర్మాణ లక్ష్యంతో మహారాష్ట్రలో గడ్చిరోలిలోకి మధ్యప్రదేశ్‌లోని బస్తర్‌లోకి ప్రవేశించిన పీపుల్స్‌వార్‌ దళాల కృషి క్యాటలిస్ట్‌గా పనిచేసి ప్రజలు నిర్మించిన చరిత్రే ఇవ్వాల్టి దండకారణ్య విప్లవోద్యమం.
1974లో ప్రారంభమయిన ఈ ఐక్యతా కృషి 2004 నాటికి డాక్యుమెంటులో చెప్పిన రెండవ ధోరనిగల విప్లవకారుల ఐక్యతా కృషి ఫలించి ఐద్య మావోయిస్టు పార్టీ 2004 సెప్టెంబర్‌ 21న ఏర్పడింది. ఈ సెప్టెంబర్‌ 21కి ఒక దశాబ్ది పూర్తి చేసుకున్న ఈ పురోగమనం 1.బోల్నీవీకరణ (ఉక్కు శిక్షణ గల పార్టీ నిర్మాణం) 2.ఐక్య సంఘటన 3.ప్రజాసైన్యం అనే మూడు అద్భుత ఆయుధాలతో క్రాంతికారీ జపనతన సర్కార్‌ను కాపాడుకుంటున్నది. ఈ సందర్భంగా గతాన్ని సమీక్షించుకునన ఈ స్వీయ విమర్శ సాయుధ పోరాట పంథాని విజయవంతం చేయడంపై వెలుగు ప్రసరిస్తుందనే విశ్వాసంతో....

Write a review

Note: HTML is not translated!
Bad           Good