మానవుని దురవస్థ, జీవితానికి సంబంధించిన అనంత సమస్యలు - ఈ రెంటినీ సమీకరిస్తూ శ్రీ కృష్ణమూర్తి చెప్పిన మాటలను ఈ పుస్తకం ద్వారా ప్రప్రధమంగా ప్రజలముందు పెడుతున్నాం. యూరపు, ఇండియా దేశాలలో అన్ని వయసుల వారినీ ఉద్దేశించి వారు ఇచ్చిన దాదాపు ఓ వంద పై చిలుకు ఉపన్యాసాల నుంచి ఈ మాటలు / వాక్యాలు తీసుకున్నాం, వారు ఓ సంవత్సరకాలంలో చేసిన ప్రసంగాలకు యిది వడపోత. వారి జీవితంలో బహుశ యిది ఉపన్యాసాల దృష్ట్యా ప్రాధాన్యమయినది.

జీవితాంతం తనకు స్నేహితంగా వున్న మేరి లూటైన్స్‌ను ఈ పుస్తకం సమీకరించమని శ్రీ కృష్ణమూర్తి కోరారు. ఈ పుస్తకానికి పేరు సైతం వారే సూచించారు. ఈ పుస్తకం కూర్పు, సంవిధానం మటుకు చదువరుల అవగాహనకు దోహదం కావాలనే దృష్టితో ఆమె చేశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good