గత 50 సంవత్సరాలుగా వైద్య విధానాల తీరు తెన్నులు ఎన్నో మార్పులకు గురైయ్యాయి. ప్రసూతి వైద్యం చెయ్యడం వైద్యులకు కత్తి మీద సాము లాంటిది. రెండు ప్రాణాలను కాపాడాలి కదా ! ఒకటి లేక రెండు కాన్పులు మించి కనడానికి ఇష్టపడని ఈ కాలంలో ప్రతి కాన్పు కూడా విలువైనదే. వైద్యంలో ఎన్నో కొత్త ఆవిష్కరణలు వచ్చినా కాన్పు సమయంలో జరిగే ప్రమాదాలను, మరణాలను తగ్గించవచ్చునేమో గాని పూర్తి ఆపలేము. సంక్లిష్టమైన ప్రసూతి శాస్త్రాన్ని ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి బోధించడం వైద్యుల వల్ల మాత్రమే అయ్యపని కాదు. ఈ లోటును భర్తీ చెయ్యడానికి వ్రాసిన ఈ పుస్తకంలోని విషయాలు ప్రతి గర్భిణి స్రీ చదివితే చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకడమే కాక అనవసరమైన భయాలు తొలగిపోతాయి. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి యువతి ,గర్భంధరించిన ప్రతి స్రీ ఈ పుస్తకము చదివి లబ్ది పొందగలరని మా నమ్మకము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good