పాట పాడడం తెలియదు
పాట రాయడం తెలియదు
కాని -
పాటంటే 'ఘంటసాలని' తెలుసు
ఘంటసాలంటే 'పాట'ని తెలుసు
పాటకు ఘంటసాల ప్రాణం
ఘంటసాల ప్రాణం పాటకు భావం
నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో
సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో
కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని
కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ
ఎందుకంటే -
ఆ కంఠం అమృతం
ఆ గానం అమృతం
ఆ పాట అమృతం
ఆ భావం అమృతం
అతడే గానామృత భాండం
అందులోనుండి జూలువారిన 555 అమృతపు చుక్కలే
ఈ ఘంటసాల 'పాట'శాల
ఆకారాదిక్రమంలో అమర్చబడ్డాయి.
అయిదుసెకన్లలో చేరుకోవచ్చు ఏ పాటనైనా
ఆస్వాదించండి... సి.హెచ్‌.రామారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good