Rs.60.00
Out Of Stock
-
+
ఈ పుస్తకంలో అంకగణితానికి, జ్యామిఇకి సంబంధించిన ఎన్నో సరదా సమస్యలు ఇవ్వబడ్డాయి. మహమ్మారి సంఖ్యలు అనే అధ్యాంలో వాస్తవ ప్రపంచంలో పెద్ద పెద్ద మొత్తాలు ఎలా ఏర్పడతాయో వివరించబడింది. తన సేవలకు తగ్గ పారితోషికం ఇమ్మని చెయ్యిచాచిన సేనానికి రోమన్ చక్రమర్తి జూలియస్ సీజర్ ఆ సేనాని కళ్లుకప్పి అతడు ఆశించినదానికన్నా చాలా తక్కువ మొత్తాన్ని ఇచ్చి సాగనంపిన కథ ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే జ్యామితికి సంబంధించిన ఆఖరి అధ్యాయంలో ఓ గ్లాసు గోడకు అంటుకొని ఉనన తేనె బొట్టును ఓ చీమ ఎలా చేరుకొంటుంది అనే సమస్య మెదడును సవాలు చేస్తుంది. ఇలా ఎన్నో సొగసైన సమస్యలతో పాఠకుల మనసుల్లో ఏ మూలైనా గణితం అంటే భయం ఉంటే దాన్ని పోగొట్టి దాని స్థానంలో గణితం పట్ల గాఢమైన అభిమానాన్ని కలగజేస్తుంది.
Pages : 93