ఈ గ్రంథం తొలిసారి ప్రచురించినప్పుడు గాంధీ ఆరాధకులు తీవ్రంగా గాయపడ్డారు, కానీ దేశంకన్నా వ్యక్తి మిన్నకాదు; చరిత్ర ఎవ్వరినీ క్షమించదు.

నిజానికి, గాంధీ, నెహ్రులనే ఇద్దరు వ్యక్తుల స్వార్ధాలు పరస్పర పూరకాలు. భారతదేశ వివేచనాతలంపై శ్రీ రహబర్ ఒక ధృవతారగా గోచరిస్తారు. ఆ వెలుగులో మనం మొత్తం రాజనీతిజ్ఞుల, విప్లవకారుల నిజస్వరూపాలను మనం చూడగలం. శ్రీ హంసరాజ్ రహబర్ ఎన్నదగిన గ్రంధం 'గాంధీ నిజస్వరూపం' వల్ల ఆయన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆగ్రహానికి గురికావలసి వచ్చింది, సత్యప్రకటనకు జైలుయాత్రల పురస్కారం పొందవలసివచ్చింది. పూర్తిగా రాజ్య వ్యతిరేకత ఉన్నా 'గాంధీ నిజస్వరూపం' ప్రజాదరణ పొందిన గ్రంధంగా రుజువైంది. ఈ 12వ (హిందీ) ముద్రణ దీని ప్రజాదరణకు నిదర్శనం. ఆయన నిష్పక్షపాత, లోపరహిత, మౌలిక సూత్రీకరణల వల్ల వివేచనాయుతమైన సాహిత్య ప్రపంచం శ్రీ రహబర్‌ని సదా సాదరంగా స్మరించుకుంటుంది. అక్షరాన్ని అగ్నికి పర్యాయపదమెలా చెయ్యవచ్చో ఈ రచన ద్వారా శ్రీ రహబర్ ఋజువు చేశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good