మహాత్మా! జాతిపిత! అన్న పరమగౌరవం ఒకవైపు, తుపాకితో కాల్చి చంపాలన్నంత పరమ అసహనం మరొకవైపు, ఒకేవ్యక్తిపై ఉన్నాయంటేనూ, చంపి 70 ఏళ్లయినా ఇప్పటికీ ఉభయ తీవ్రతలు కొందరిలోనయినా కొనసాగుతున్నాయంటేనూ నిశ్చయంగా ఆయన మహా గొప్పవాడే. తీవ్రంగా వ్యతిరేకించేవారికన్నా అమితంగా గౌరవించే ప్రపంచ మేధావులే ఎక్కువగా ఉన్నారన్నది నిజం. ఆయన జన్మదినాన్ని (అక్టోబరు 2) అంతర్జాతీయ అహింసా దినంగా యు.ఎన్‌.ఓ. గుర్తించడమే అందుకు నిదర్శనం. అట్లాంటి వ్యక్తిని గురించి కొంతయినా ఈ తరం తెలుసుకోవద్దా! తెలియని భక్తితో గౌరవించటంకన్నా ఆయనపై ఇన్నిచ్ఛాయలు ఎందుకు వచ్చాయో తెలుసుకోవటం మంచిది. ఆ అవసరం తీర్చాలంటే ప్రాథమిక పాఠకుల కోసం ప్రామాణికుల అభిప్రాయాలను సంకలనం చేసి తెలుగులో అందించటానికి ఈ 150వ జన్మదినం మంచి సందర్భమనిపించింది. స్వాతంత్య్ర పోరాటంలో దేశ విముక్తిని మాత్రమే గీటురాయిగా పరిగణిస్తే గాంధీజీ పరాజయమే పొందాడు. మహమ్మదాలిజిన్నాయే విజయం సాధించాడు. దేశాన్ని చీల్చగలిగాడు. ప్రపంచ పటం మీద కొత్త దేశాన్ని సృష్టించగలిగాడు. మనుగడలో ఉన్న దేశం మొత్తాన్ని ఒకటిగా ఉంచి స్వతంత్రం తేలేకపోయినందుకు గాంధీజీ అపజయమే. కాని గాంధీ జయాపజయాలకు స్వాతంత్య్రసాధన గీటురాయి కాదు. ఏ విజయాల కొలతతోనూ గాంధీజీ జయకిరీటం పెట్టలేం.

పేజీలు : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good