శర్మగారి మొదటి కథాసంపుటి 'సెలవయ్యింది'! ఇది రెండవ సంపుటి. ఇందులో 20 నిక్కమైన మంచి నీలాలున్నాయి!

ఈ కథల్ని లోచూపుతో చదువుతుంటే - ప్రకృతినీ, సమాజాన్నీ, మనుషుల్నీ అతి నిశితంగా పరిశీలించటం, అధ్యయనం చేయటం శర్మగారి స్వాభావిక లక్షణంగా కనిపిస్తుంది. కథల్లో కనిపించే వస్తు విస్తృతికి అబ్బురపడతాము. ఒక కథలో గ్యాస్‌ బేస్డ్‌ పవర్‌ప్లాంట్‌ వర్క్‌ప్లేస్‌లో తిరుగుతాము. వివరాలు తెలుసుకుంటాము. మరోదానిలో జిల్లా కలెక్టర్‌ పదవీ బాధ్యతల్నీ, పని ఒత్తిడిని, వాటి మధ్యన వ్యక్తిగత అవసరాల సంఘర్షణనీ చదువుతాము. కాగులకూ, బిందెలకూ మాట్లు వేసుకునేవారి కొలిమి పరిసరాల్లో నిలిచి, వాడిజీవన విషాదాన్ని తిలకిస్తాము వేరే కథలో. మరో కథ కోర్టు ఆవరణనీ, చెట్లకింద కోర్టు పక్షుల్నీ పరిచయం చేస్తుంది. ఇంకా శర్మగారి కథల్లో 'దహన సంస్కార మహాప్రస్థానస్థలి'ని దర్శిస్తాము. ఎగుమతి దిగుమతుల వ్యాపారంలోని అనుపానుల్ని అర్థం చేసుకుంటాము. శానిటోరియంలోకీ, సేవా సంస్థల్లోకీ ప్రవేశిస్తాము. ఇంజనీరింగ్‌ పనులూ, కాంట్రాక్టులూ, రాజకీయాలూ జమిలిగా సాగే స్థావరాలూ పలకరిస్తాయి మనల్ని. అందులో మళ్ళీ నెఱజాణలు 'రంగు' నడతల్నీ గమనిస్తాము. భూభాగోతాల, కబ్జాల వింతదృశ్యాలూ కదులుతాయి ఒక కథలో....

- విహారి

Write a review

Note: HTML is not translated!
Bad           Good