నా లోపల ఒక సముద్రం వుందని తెలుసుకానీ అందులో ఇన్ని జలస్తంబాలూ, అనేకానేక తుఫానుల్లో మునిగిపోయిన ఇన్ని మహా నౌకలు, నౌకల్లో ఇన్ని అక్షౌహిణుల సైన్యమూ, లక్షలాది ఈటెలు, కరవాలాలూ, అసంఖ్యాక శిరస్త్రాణాలూ, లోహ కవచాలూ, ద్రవమై వున్నాయని ఇప్పుడే, ఆరుపదుల అనుభవాల అణువిస్ఫోటన జరిగినప్పుడే తెలిసింది ప్రియతమా! ఈ లోలోపలి అంతర్‌ సాగరమధనంలో జనించే విద్యుత్తుతో జగమంతా ధగధగలు వెలిగిస్తా చూడు!

Write a review

Note: HTML is not translated!
Bad           Good