Rs.120.00
In Stock
-
+
హాస్యం ఆరోగ్యవర్థకం. ఆరోగ్యవర్థకమైన హాస్యం మానసికోల్లాస ప్రవర్థకం. చిలకమర్తి శబ్దాశ్రయ హాస్యానికి వారి ''లండన్ సంకల్పం'' మచ్చుతునక. ఇక గణపతి చిలకమర్తికి హాస్య వాజ్మయ నిర్మాతగా స్థానం కల్పించిన వస్తుగత హాస్య నిర్భరం. గణపతిలో మూడు తరాల కథ వుంది. గణపతిని ఆలంబనంగా చేసుకొని చిలకమర్తి నాటి విద్యావిధానాన్ని పాఠకులముందుంచారు. సాంప్రదాయ ధోరణిని విమర్శిస్తూ, కొత్త సంస్కృతి నాటి యువతను వేషభాషల్లో ఆచార వ్యవహారాల్లో ప్రభావితం చేస్తున్న తీరును, న్యాసంబంధమైన ఆచరణలో ప్రజలకు ఎదురవుతున్న కష్టనష్టాలను విశదీకరించారు. గణపతి ఒక అధిక్షేపాత్మక నవల. భిన్న పాత్రల ద్వారా సామాజిక దురాచారాలకు అద్దం పట్టింది.
Pages : 166