నదికి తన గమ్యం తెలియకపోయినా, అది తన గమనాన్ని ఆపకుండా సముద్రం వైపు సాగిపోతుందనీ, అలాగే, ప్రతిమనిషీ తన గమ్యం వైపు ఎన్ని కష్టాలు, సమస్యలు వచ్చినా సాగిపోవాలనీ ‘గమ్యం’ కథ చెబుతుంది.

జీవితం అన్నది పూలపాన్పు కాదనీ, కష్టాల కడలి అనీ, అయినా మొక్కవోని ధైర్యంతో దానిని ఎదురీదాలని ఈ కథ సారాంశం.

మనిషికి నిరాశ పనికిరాదు. ఆశాజ్యోతి చీకట్లను పారద్రోుతుంది.

ఈ కథా సంపుటిలోని 22 కథలు మనుషుల సమగ్ర జీవనయానాన్ని ఆవిష్కరిస్తాయి. సమస్యల్ని ఎలా ఎదుర్కొని ముందుకు సాగాలో చెప్పకనే చెబుతాయి. మనుషులు నిజాయితీగా బ్రతకాలనీ, నైతిక విలువలు పాటించాలనీ నిర్దేశిస్తాయి.

ఇందులోని ఒక కథలో చెప్పినట్లు ‘‘అందమైన పచ్చని లోయని చూడాలంటే ఎత్తైన కొండని ఎక్కక తప్పదు’’.

పేజీలు : 152

Write a review

Note: HTML is not translated!
Bad           Good