దైవభక్తుల్ని ఎలాంటి పరిస్థితిలోనూ నమ్మకండి. వాళ్ళకు సామాజిక ఆచరణ తాలూకు అవగాహన వుండదు. వాళ్ళు ఆచరణకు దూరంగా, ఫలితాన్ని అనుభవించడానికి దగ్గరగా వుంటారు. అన్నింటికంటే ఘోరమైన, దారుణమైన విషయం - కోట్లాది మానవుల శ్రమఫలితమైన సామజిక ఉత్వత్తుల శ్రేయాన్ని, అదృష్ట - అగోచర - కల్పిత - లేని - భగవంతుడికి అంటగట్టి, మానవుల్ని హినుల్ని, దీనుల్ని, బానిసల్ని చేసేస్తారు!
సమాజంలో - మానవ శ్రమ దోపిడీకీ మూలమైన అనేక కారణాల్లో - దైవభావన ఓ ప్రముఖ కారణం అనవచ్చును.
శరీర శ్రమ ద్వారా బ్రతుకులీడుస్తూన్న కోట్లాది మానవులు పై వర్గాల ద్వారా కల్పించబడిన దైవభావన అనే మొహజాలంలో, మోసపూరిత మాటల్లో చిక్కుకుని - నిరంతరాయంగా, తరతరాలుగా మోసపోతున్నారు! ఇలా ప్రజల్ని - శ్రమ జీవుల్ని - మోసగించడంలో అన్ని మతలూ సమానంగా భాగస్వాములవుతూన్నాయి! ఏ మతమూ గర్వపడవల్సింది ఏమీ లేదు.---- ఆలూరి భుజంగరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good