''నేనేమిటో నాకు తెలుసు - నేను ఆదునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకలసంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు - నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది - ఒక సంకెల తెగితే మరొకటి వచ్చి పడుతోంది. నేను పోరాడుతున్నాను. జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్‌గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ, ఎన్ని పరీక్షలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు ఐనా ఆనందంగా ఉంది. నేను నేనైనందుకు ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధతలతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం కదా మనందరం''.

''ఇన్ని ఉద్యమాలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేశారో ప్రజలు - ఆ ప్రపంచం కేవలం ఒక కల అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి. నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీన్నంతా తట్టుకునే గుండె నిబ్బరం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి?''

Pages : 398

Write a review

Note: HTML is not translated!
Bad           Good