నా పేరు గలివర్. మా తండ్రికి అయిదుగురు కుమారులయితే వారిలో నేను మూడవ వాడ్ని. మా తండ్రికి నాటింగ్ హామ్షైర్లో కొద్దిపాటి స్థలమే వున్నా అది చాలా విలువైనది కావడంతో మేము కొద్దిపాటి ఆస్తిపరుల క్రిందే లెక్క. అందువలన మా తండ్రి మా చదువుల కోసం బాగానే ఖర్చుపెట్టేవాడు.
నా పద్నాలుగోయేట నన్ను కేంబ్రిడ్జిలోని ఎమ్మాన్యుయేల్ కాలేజీలో చేర్పించారు. అక్కడ మూడేళ్ళపాటు వుండి చదువుకున్నాను. నన్ను అక్కడ వుంచి చదివించడానికి మా నాన్న పంపించిన డబ్బు సరిపోయేదికాదు. అలాగని ఆయనని ఇంకా డబ్బు పంపమని అడగటం నాకిష్టంలేదు.
నా ఖర్చులకు కావలసిన డబ్బుని సంపాదించుకోవడానికి జేమ్స్ బేటెస్ అనే శస్త్ర వైద్యుడికి సహాయకుడిగా పని చేశాను. అలా నాలుగేళ్ళపాటు ఆయన దగ్గర పనిచేశాను. మా నాన్న పంపించే డబ్బుతో గణితశాస్త్రానికి చెందిన పరికరాలను, నౌకాయానానికి సంబంధించిన పుస్తకాలను కొనేవాడిని. నా విరామ సమయంలో వాటిని అధ్యయనం చేస్తుండేవాడిని.
పేజీలు :200