Rs.165.00
Out Of Stock
-
+
''సరదాగా మరికొంతసేపు'' అన్న వుడ్హౌస్ అనుసృజనలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. అందులో 'సినిమారంగం'కు చెందినవి నాలుగు.
సినిమారంగపు నాలుగు కథల్లో రెండిట నరసరాజు, రాగిణిల ఉదంతాలు కనిపిస్తాయి. మరో కథ 'కోతిచేష్టలు' లో వీళ్ళిద్దరూ పేర్లు మార్చుకొని కనకరాజు, సుభాషిణి అయ్యారా అనిపిస్తుంది. నాలుగో కథ 'మీనా దేశ్పాండే తారాపథం' మొట్టమొదటి సోంబాబాయి కథలాగా మిగిలినవాటికి వేటికీ చెందని విలక్షణత గలది.
ఇంకా సోంబాబాయి వలస కాపురం, బుసబుసలు, తల్లిగారి ఘనసత్కారం, శేషగిరి తంటాలు, విధి, అదృష్టం, విశ్రాంతి చికిత్స అనే మరో 7 కథలు ఉన్నాయి.