'మన శారీరక, మానసిక ఆరోగ్యాలు మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి వుంటాయి. మరి అంత ప్రాధాన్యత కల  ఆహారం విషయంలో మనం ఏం చేస్తున్నాం? మినరల్స్‌, విటమిన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ అన్నీ వున్న సంతులిత పోషకాహారం తీసుకుంటున్నామా? శరీరానికి కావల్సిన అన్ని విటమిన్స్‌, మినరల్స్‌ అందకపోతే శరీరం రోగాలపాలవుతుంది. ఒక్కసారి శరీరం అనారోగ్యం తాలూకు విషకోరల్లో చిక్కిన తర్వాత తిరిగి ఆరోగ్యం పుంజుకునేందుకు మనం నానా తంటాలు పడతాము. ఎన్నో మందులు మ్రింగుతాము.

''ఆహారమే ఆరోగ్యం...ఆహారమే వైద్యం..'' అనే అతి ముఖ్యమైన విషయాలు మీకు ఈ ''ఫుడ్‌థెరపీ'' పుస్తకంలో కనబడతాయి. ఏ రకమైన ఆహారం ఏవిధమైన అనారోగ్యానికి ఔషధంగా పని చేస్తుందన్నది ఈ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఆహారం ద్వారా ఆరోగ్య సంరక్షణ అనేది సహజసిద్ధమైన విధానం. ''ఫుడ్‌థెరపీ'' ద్వారా మీ శారీరక, మానసిక ఆరోగ్యాలు అద్భుతంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం ఆహారం తాలూకు ముఖ్యమై లియ ఏమిటన్నది ''ఫుడ్‌థెరపీ'' చదవటం ద్వారా మీకు అర్థమవుతుంది. - ఆదెళ్ళ శివకుమార్‌

Pages : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good