కొన్ని పుస్తకాలు చదవటానికి...మరికొన్ని వ్రాయటానికి...ఈ యోగ పుస్తకం చెయ్యటానికి....

10 వేల సంవత్సరాల నాటి ప్రాచీన భారతీయ కళ. అంతకుముందే ఆర్కియాలాజికల్‌ త్రవ్వకాలలో దొరికిన వాటిని పరిశీలిస్తే సింధూ నాగరికత సమయానికే అనేక ముద్రలలోని శివపార్వతుల భంగిమలని గమనిస్తే యోగ అప్పటికే ప్రాచుర్యంలో ఉందని అర్ధమవుతుంది. ఒకప్పుడు అతి రహస్యంగా ఉంచబడిన యోగ నేడు అందరికీ అందుబాటులో ఉంది. ఋషులు, యోగులు అన్నేళ్ళు బ్రతకటానికి యోగనే కారణం. యోగ గురించి వేదాల్లో సయితం చెప్పబడింది. కొన్ని కంట్రీస్‌లో సైన్యానికి ప్రతిరోజూ యోగ తప్పనిసరి. యోగకు ఆధ్యుడు శివుడు, ప్రధమ శిష్యురాలు పార్వతి. ఆరోగ్య శాస్త్రాల్లో అత్యంత పురాతనమైనది యోగనే. యోగపై జరిగిన అనేక పరిశోధనల్లో మందులకు లొంగని దీర్ఘవ్యాధులు యోగకి లొంగాయని తేలింది. యోగద్వారా సైకోసోమేటిక్‌ డిసీజెస్‌ గుండెజబ్బులు, బి.పి., షుగర్‌, ఆందోళన...భయం... అధిక బరువు... ఆస్త్మా, చర్మవ్యాధులు సయితం తగ్గుతాయనడంలో సందేహం లేదు...

Write a review

Note: HTML is not translated!
Bad           Good