మీరు మీ శరీరాకృతిని మార్చుకోగలరా?

ఔను, మీరు మీర్చుకోగలరు. బాలీవుడ్‌లోని సుప్రసిద్ధ ఫిట్నెస్‌, యోగ నిపుణులు పాయల్‌ గిద్వానీ తివారీ మీరు మీ శరీరాకృతిని ఎలా మార్చుకోవచ్చో మీకు వివరిస్తుంది. చాలా సులభంగా చెయ్యటానికి తేలికగా ఉండే సూత్రాలనీ, వ్యాయామ పద్ధతులనీ, బరువు ఎలా పెరగాలి, ఎలా తగ్గాలి అనే విషయాలనీ, శరీర ధారుఢ్యాన్ని సంపాదించుకునే మెలకువలనీ, మీ శరీర నిర్మాణాన్ని మర్చుకునే విధానాన్నీ నేర్పుతుంది. అంతేకాదు! ఉన్న వయసుకన్నా పదేళ్ళు తక్కువ ఉన్నట్లు కనిపించడం ఎలాగో, కళ్ళకి కనిపించని ఒత్తిడి, నిద్రలాంటి అంశాలు మీ రూపాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చెబుతుంది. అందుచేత, ఇక మీరు మీ అభిమాన తారలని చూసి అసూయ పడక్కర్లేదు. మీరు కూడా వాళ్ళలా కనిపించవచ్చు. ఫోటోలూ, ప్రసిద్ధులైన వారి వ్యాయామక్రమాలు, ఆ తారలు మీకు అందించే చిట్కాలూ, అన్నీ ఇందులో వున్నాయి. అందమైన ఆకృతి కోసం మీకు మీరు బహూకరించుకోగల అత్యుత్తమ కానుక.
'నా జన్యువులని సవాలు చేసి, నా శరీరాన్ని పూర్తిగా మార్చుకునేందుకు పాయల్‌ నాకు సాయం చేసింది. ' కరీనా కపూర్‌
'ఒకసారి యోగ మొదలు పెట్టాక అనారోగ్యంగా ఉండటం కష్టం.' సైఫ్‌ అలీ ఖాన్‌
'నా ఆరోగ్యాన్నీ, రూపాన్నీ యోగ సమూలంగా మార్చేసింది.' రాణి ముఖర్జీ

Write a review

Note: HTML is not translated!
Bad           Good