మీడియాలో ఇప్పుడు నడుస్తున్నది 'ఫీచరింగ్' యుగం. దినపత్రికలూ, వెబ్ జర్నల్సూ, టీవీ చానెల్లూ - అన్నింటా ఫీచర్కే డిమాండ్. ఇక్కడే కాదు, విశ్వవ్యాపితంగా ఫీచర్ కున్న ప్రాచుర్యం అలాంటిది. ఎటొచ్చీ ఫీచర్లు రిపోర్టు చేసేవారూ, వాటిని తీర్చిదిద్దే వారే కరవయ్యారు. ఈ లోటును గమనించే సతీష్ చందర్ రిపోర్టింగ్లోనూ, డెస్క్లోనూ, మీడియా బోధనలోనూ తనకున్న అనుభవాన్ని, అధ్యయనానికి రంగరించి 'ఫీచర్లు : ప్రయోగాలు' అనే పుస్తకం తెచ్చారు. జర్నలిజం విద్యార్థులు నేర్చుకోవటానికీ, ఇప్పటికే పనిచేస్తున్న పాత్రికేయులు తమ నైపుణ్య పరిధిని పెంచుకోవటానికీ, మీడియా అధ్యాపకులు బోధనను ఆసక్తికరంగా మార్చుకోవటానికీ, ఫ్రీలాన్సర్లు బయటనుంచి మీడియాకు ఫీచర్లను రాయటానికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. పేరుకు పాఠ్యపుస్తకమయినా, తీరులో ప్రాక్టికల్ గైడ్.
పేజీలు : 207