విజ్ఞానం రోజు8 రోజుకి పెరిగిపోతోంది. మనిషికి వున్న సమయం చాలడంలేదు. మనిషి వర్తమానంలో బ్రతుకుతున్నాడు. భవిష్యత్లోకి తొంగిచూడటానికి ప్రయత్నిస్తున్నాడే తప్ప గతంలోకి కనీసం దృష్టి సారించడానికి కూడా ప్రయత్నించడం లేదు. ప్రస్తుతానికి అందువల్ల నష్టంలేకపోవచ్చు. అందువల్ల వాటిలో నష్టాలు భవిష్యత్లో అనుభవానికి రావచ్చు.
'చరిత్ర' అనేది ఒకప్పుడు అందరికీ ఇష్టమైన పదం! అదిప్పుడు చాలా కొద్ది మందికే ఇష్టమైన పదం! మరి కొంతమంది దాన్ని ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు నాలుగోతరగతి నుంచి చరిత్రాంశాలు విద్యార్థులకు బోధించేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి.
సాక్షాత్తూ ప్రభుత్వాధినేతలు కూడా చరిత్ర అనవసరం అని, చరిత్రను బోధించవద్దు, పాఠ్యాంశాల్లోంచి తొలగించండి అంటూ ప్రకటనలు కూడా చేశారు. అయితే ఆయనకి చరిత్ర ప్రాధాన్యం తెలియదా? తెలిసివుంటే అలా అనేవారా? ఆ మహానాయకుడు తెలునేలను పరిపాలించిన సంగతి రాబోయే తరాల వారికి ఎలా తెలుస్తుంది? కేవలం చరిత్రవల్లనే ఆ సంగతి చరిత్రలో లిఖించడం వల్లనే....
పేజీలు : 224