ప్రయోజనకరమైన, ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే
నా పేరు ఫకీర్ షా. ఇది తల్లిదండ్రులు పెట్టినపేరు కాదనీ, ఉమర్ ఖయ్యాంలాంటి పౌరుషనామం (తఖిల్లాస్) మాత్రమే అనీ వేరే చెప్పనక్కరలేదు. ఈ పేరుతో ప్రతివారం మద్రాసు నుంచి సినీమా విశేషాలు రాస్తూ వుంటాను: మద్రాసు సినీరంగంతో నాకు కనీసం పాతికేళ్ల పరిచయం ఉంది. ఇదే ఈ శీర్షిక నిర్వహణకు నా ముఖ్యమైన అర్హత.
ఫలానా సినీమా తార ఇంట్లో పిల్లి పెద్దమనిషయిందన్న వార్తవంటిదేదీ మీకు అందించడం నా ఉద్దేశం కాదు. సినీఫీల్డులో సాగుతున్న దురాచారాలన్నింటినీ దుయ్యబట్టి శుద్ధి కార్యక్రమం చేపట్టాలని కూడా నాకు లేదు.
సినీకవి శ్రీశ్రీతో నాకు చాలా సన్నిహితమైన సంబంధం వుంది. అతనే ఈ శీర్షిక నిర్వహిస్తే నిర్మొహమాటంగా ఎన్నో విషయాలు బయట పెట్టగలడు. అంత ధైర్యం నాకు లేదు. ఏమయినా నేను సినీఫీల్డుని అంటిపెట్టుకొని బతుకుతున్నవాణ్ణి. కూర్చున్న కొమ్మని నరుక్కోవడం తెలివయిన పనికాదు.
పేజీలు : 24