ఆశించిన ఫలితాలు సాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా మలుచుకోండి.
ఈ సృష్టిలో జన్మించిన ప్రతి వ్యక్తిలోను అద్భుతమైన శక్తి ఉంది. నిద్రాణమైన ఆ శక్తిని గుర్తించి మనిషి జీవితకార్యంపై కేంద్రీకరిస్తే జీవితాన్ని అర్ధవంతంగా, అమూల్యంగా, అద్వితీయంగా తీర్చిదిద్దుకోవచ్చు. వ్యక్తిలోని ఆ శక్తి వ్యక్తిగత ఉన్నతికి, సమాజ శ్రేష్ఠతకు పునాది. మీలో ఉన్న ఆ అద్భుతశక్తిని జీవిత ప్రాధాన్యాలపై కేంద్రీకరించి ఆశించిన ఫలితాలు సాధించటానికి ఈ పుస్తకం సహాయపడుతుంది.

ఈ పుస్తకం ఉపయోగాలు :
మీ గురించి మీరు అర్థంచేసుకోవడానికి,
మీరు కోరుకున్న నిజమైన ఫలితాలు తెలుసుకోవడానికి,
మీ అంతర్గత నమ్మకాలు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గుర్తించడానికి,
మీ మానసికస్థితులను మీరు అర్థం చేసుకోడానికి,
మీపై మీరు ప్రేమ పెంచుకోడానికి, ఉన్నత స్వీయభావన ఏరప్రరచుకోడానికి,
మీ లక్ష్యాలను శాస్త్రీయంగా నిర్దేశించుకోడానికి,
లక్ష్యాలదిశలో ప్రయాణాన్ని, ప్రతి క్షణాన్ని ఆనందించడానికి,
తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత సాధించడానికి,
శ్రేష్ఠత (ఎక్స్‌లెన్స్‌) సాధించే క్రమంలో జీవననైపుణ్యాలు, ఉన్నత ఆలోచనలు, అర్థవంతమైన అలవాట్లు నిర్మించుకోడానికి ఈ పుస్తకం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ పుస్తకంతో పాటు "ప్రత్యేక శిక్షణాదీపిక" ఉచితం,

Write a review

Note: HTML is not translated!
Bad           Good