నిన్ను నలుగురూ దేనికోసం గుర్తుపెట్టు కోవాలని భావిస్తున్నావు? నువ్వు సమర్పించిన పిహెచ్‌.డి. సిద్ధాంత వ్యాసం కోసమా? నీ న్రపయోగశీలభావనలకోసమా? నిన్నూ నీ జీవితాన్నీ నువ్వే తీర్చిదిద్దుకోవాలి. దాన్ని నువ్వొక పుటపై లిఖించుకోవాలి. మానవచరిత్ర అనే గ్రంధంలో ఆ పుట బహుశా అతి ముఖ్యపుటగా మారవచ్చు. అది ఒక కొత్త విషయాన్ని కనుక్కోవడానికి సంబంధించిన పుట కావచ్చు. కొత్త పుంత తొక్కడం గురించి కావచ్చు. కొత్త అన్వేషణకు సబంధించిన పుట కావచ్చు లేదా ఏదో ఒక అన్యాయాన్ని ఎదిరించడం గురించి కావచ్చు. కాని నీ జాతి చరిత్రలో అటువంటిదేదో ఒక పుటను రూపొందించి నందుకు మాత్రమే నువ్వు శాశ్వత స్మరణీయుడవుతావు...'
సరాసరి తన హృదయాన్ని చీల్చుకువచ్చే సరళ వ్యాక్యాలతో జాతి జీవితంపట్ల తన మమేకత్వాన్ని మనతో కలాం పంచుకోవటం ఈ పుస్తకం సారాంశం. మానవ, జాతీయ, గ్లోబల్‌ అంశాలెన్నింటిపైనో కలాం మదిలో చెలరేగిన భావాల సమాహారం ఈ పుస్తకం. సరాసరి మన ఎదురుగా నిలబడి మన కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుండే మంత్రమయ వాక్యాల సంపుటం ఈ పుస్తకం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good