రాజధాని నగరాన్ని మరోచోటికి తరలించవలసిన సమస్య చాలా కఠినమైన సవాళ్లను ఏర్పరచినప్పటికీ నిర్ణయాలు తీసుకునే స్థానంలో వున్నవారికి సృజనాత్మకమౌన కొత్తబాటలు వేసే సువర్ణావకాశాన్ని కూడా ఇచ్చింది. గతంలో ఏర్పడిన రాజధానీ నగరాలు సాధారణంగా ఒకేచోట ఎక్కువ జనాభా కేంద్రీకృతమైనవి, పట్టణ ప్రాంతాలు కలిసి ఏర్పడినవి. కానీ డిజిటల్‌ కనక్టివిటీ, వేగవంతమైన రవాణా లభ్యమైన నేటి పరిస్థితులలో రాజధానులు ఒకచోట కేంద్రీకృతమై ఉండవలసిన అవసరం లేదు. ప్రభుత్వ కేంద్రాన్ని ప్రజలకు మరింత దగ్గరగా తీసుకొని వెళ్లవచ్చు. ప్రస్తుతం మనకు లభిస్తున్న సాంకేతికతలు అధికారిక సమాచారాన్ని డిజిటల్‌ స్టోరేజ్‌ రూపంలో నిలువచేయడానికి, ఆన్‌లైన్‌లో వ్యవహారాలు జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఒకేచోట భారీ భవనాలు నిర్మించి అధికారాన్ని కేంద్రీకృతం చేయడం, వాటి నిర్మాణానికి విపరీతమైన డబ్బు ఖర్చుపెట్టడం దానికి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకత్వం సృజనాత్మకంగా ఆలోచించదలచుకున్నట్లయితే ప్రజాప్రధానమైన ప్రభుత్వం విషయంలో తక్కిన దేశానికి ఒక ఆదర్శాన్ని నెలకొల్పగలిగి ఉండేది. దురదృష్టవశాత్తు రాష్ట్ర రాజకీయ నాయకత్వం తన దృక్పథంలో పూర్తిగా చత్వారంతో వ్యవహరించింది. ఇటువంటి అతిముఖ్యమైన నిర్ణయం తీసుకోవడంలో విశ్లేషణాత్మకంగానూ, సంయమంతోనూ ఆలోచించే అవకాశాన్ని వదిలిపెట్టింది. దురదృష్టవశాత్తు ఇటువంటి నిర్ణయం వల్ల కలిగే సామాజిక కష్టనష్టాలను భరించవలసిన వారు ప్రస్తుత రాబోయే తరాల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలే తప్ప ఈ రాజకీయ నాయకులు కారు.


కృష్ణారావు ఈ రచనలో చూపించిన సూక్ష్మ విశ్లేషణ నిజంగా గణనీయమైనది. ప్రపంచంలో నగరీకరణ ఎలా జరిగింది, ముఖ్యంగా రాజధానీనగరాలు ఎలా ఏర్పడ్డాయి, అన్న విషయంలో భారతదేశంలోనూ, ఇతరత్రా జరిగిన పరిశోధనల ఫలితాలను ఆయన చర్చించారు. రాజధానీ నగరంగా అమరావతిని నిర్ణయించడంలో జరిగిన లోపాలను, నగరప్రణాళికలో లోపాలను, తత్కారణంగా భవిష్యత్తులో ఏం జరగవచ్చునో అన్న విషయాలను ఆయన సూక్ష్మంగా పరిశీలించారు. గతకాలపు అనుభవాల దృష్ట్యా కృష్ణారావు తెలిపిన విషయాలనుండి రాష్ట్ర రాజకీయ నాయకత్వం పాఠాలను నేర్చుకున్నా, శివరామకృష్ణన్‌ కమిటీ వివేకవంతమైన సూచనలను పట్టించుకున్నా ప్రస్తుత, భవిష్యత్తరాల ప్రజలపై ఈ ప్రాజెక్టు సామాజిక వ్యవ భారాన్ని గణనీయంగా తగ్గించగలుగుతుంది. రాజధానీ నగరాన్ని ఒకేచోట కేంద్రీకరించకుండా భిన్నప్రదేశాలలో పంపిణీ చేసి ప్రభుత్వ పాలనను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలకు సమీపంలోకి తేగలుగుతుంది. - ఇ.ఎ.ఎస్‌.శర్మ


పేజీలు : 110


Write a review

Note: HTML is not translated!
Bad           Good