రెండు నెలల తర్వాత అమెరికా వెళ్ళే విమానం ఎక్కడానికి ఎయిర్‌పోర్టుకి వెళ్ళారు అశ్విన్, చారులతలు, ఆశ్విన్‌కి పోర్ట్లేండ్లోని మారియట్ హోటల్లో అసిస్టెంట్ షెఫ్‌గా ఉద్యోగం ఇచ్చాడు ఆ హోటల్ ఎం.డి.
ఇండియాలోని ఓ వివాహానికి హాజరై భోజనం చేసిన ఎం.డి. ఆ వంట చేసిందెవరో వాకబు చేశాడు. తన హోటల్లో ఇండియన్ రెస్టారెంట్ తెరిస్తే అమెరికన్స్ ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తారని ఆయన నిశ్చయానికి వచ్చాడు.
అశ్విన్‌తో మాట్లాడి హెచ్‌ఒన్ వీసాకి స్పాన్సర్ చేశాడు. దంపతులిద్దరికీ ఒన్ వే ఎయిర్ టిక్కెట్‌ని ఆయనే పంపాడు. చారులత భర్తతోపాటు విమానం ఎక్కడానికి వచ్చేసరికి పుట్టింటి వాళ్ళంతా ఏర్పోర్ట్లో ఉన్నారు. కూతురికి కన్నీళ్ళతో వీడ్కోలు పలికింది తల్లి. ఎయిర్ పోర్ట్‌లో సరిగ్గా అలా కన్నీళ్ళు పెట్టుకున్న మరో వ్యక్తి కుంచితపాదం. కుంచితపాదం గొంతు తగ్గించి అడిగాడు అశ్విన్‌ని.
''ఇంతకీ మా ఆవిడ శవాన్ని ఎక్కడ పాతారు?''
''మీ స్ధలంలోనే'' చెప్పాడు అశ్విన్.
''అయితే మేం చెప్పేది అబద్దమో, నిజమో మీకు తెలీదు. అసలు ఆ శవాన్ని ఎక్కడ పాతాం అన్నది మీకు రహస్యమే'' చెప్పింది చారులత నవ్వుతూ.
''ఐనా ఇక మీకే భయం వద్దు. ఎక్కడున్నా మీకేం ప్రమాదం రాదు'' చెప్పాడు అశ్విన్.
కొద్దిసేపట్లో అశ్విన్, చారులత ఎక్కిన విమానం గాల్లోకి లేచింది. అసలు కుంచితపాదం తన భార్యను ఎందుకు చంపించాడు? శవాల్ని పాతిపెట్టిన అశ్విన్, చారులతలు పోలీసులకు దొరక్కుండా అమెరికా ఎలా వెళ్ళగలిగారు? ఇంకా ఎన్నో ఇలాంటి ప్రశ్నలు, వాటన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే మీరు ''ఆంధ్రుల ఆహ్లాద రచయిత అని ప్రశంసించబడ్డ శ్రీ మల్లాది వెంకట కృష్నమూర్తి గారు రాసిన తాజా కామెడీ నవల ఎంతెంతదూరం చదవాల్సిందే.
Rs.60.00
Out Of Stock
-
+