ఎంకిపాటలు రెండుమూడు విధాల ప్రజల ఆగ్రహాల్ని అమితంగా భగ్గుమనిపించాయి. భాషనితెచ్చి సభ్యతనీ, మర్యాదనీ ఇప్పించాలని చూశాడు కవి. ముందు ఎంకి పదం నోళ్ళల్లోకి తీసుకోవడానికి భంగపడ్డారు పుణ్యులు. పైగా శృంగారం. తెలుగు విద్వత్ప్రపంచం అసహ్యించుకొని, దరిచేరనీని శృంగారం. రహస్యం ఇష్టం. బూతు ఇష్టం. కుళ్ళుని జుర్రుతారు. కానీ శుభ్రమైన, బహిరంగమైన శృంగారం. అందులో నాయికానాయకలు అనాగరికులు. పెళ్ళి అయినట్టూ కనపడదు.

                అన్నిటికన్నా కడుపుమంట, శీలాలమంట, ఈర్ష్యలమంట ` పాటలు అందం. మాటలో అందం. మనసులో అందం. భావంలో అందం. కథలో అందం. నడకలో అందం. తీరులో అందం. లయలో అందం. ధ్వనిలో అందం. విద్యావంతులూ, మర్యాదస్తులు అనుకునే స్త్రీలకి తలవొంపులైన అందం.

                ఎంకి పాటల ప్రచురణతో తెలుగు సారస్వత ఏకైక గ్రంథాలయానికి నిప్పంటుకున్నట్టు అరిచారు. మొదటిరోజుల్లో  సుబ్బారావుగారికి తననితాను నిలవతొక్కుకొని విరోధించి ప్రపంచాన్ని ఎదిరించే సాహసంలేదు. స్వతహాగా భయస్తుడు. హృదయం చాలాసున్నితం. కానీ సుబ్బారావుగారి అదృష్టమూ, ఆయన సౌహార్ధ్రం, నమ్రత, ఆపాటల మధురశృంగార వశీకరణ, ఆయన్ని సమర్థించి వెన్నుచరచి వెనకవేసుకొచ్చే పండితుల్నీ, అధికారవంతుల్నీ, సమర్థుల్నీ ఆయనకిసమకూర్చాయి. సుబ్బారావుగారు గట్టిబలగంతో బయలుదేరారు. తెలుగు ఛాందస కుహనానవీన వాంగ్మయంపైన యుద్దానికి’’. ` చలం

పేజీలు : 143

Write a review

Note: HTML is not translated!
Bad           Good