ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడం లేదు. నిజం చెప్పాలంటే మరింత ఎక్కువవుతున్నది. ఇలాంటి సమయంలో ఈ భాషను నేర్చుకోవాలన్న తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాని ఇది పరాయి భాష. ఓ భారతీయ భాష వచ్చిన వారు, మరొక భారతీయ భాష నేర్చుకోవడం కొంత సులభం. కాని ఇంగ్లీసు అలాంటిది కాదు. అయినప్పటికీ తేలిగ్గా నేర్చుకోవడానికి అనేక పుస్తకాలు వెలువడుతున్నాయి. అనేక పద్ధతుల్లో నేర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి కోవలోకే చెందింది ఈ 'ఇంగ్లీషు టీచర్‌' పుస్తకం.

ఇంగ్లీషు భాషను నేర్పించడంలో పలు విధాలుగా కృషి చేస్తున్న బేజిని సంజీవ్‌ ఈ పుస్తకాన్ని రచించారు. కొత్తగా దేన్నైనా తెలుసుకోవాలంటే బాగా తెలిసిన వారెవరయినా బోధించాలి. అలాంటి పుస్తకాలు అనేకం వెలువడ్డాయి. వాటన్నింటికి భిన్నంగా ఈ పుస్తకం ప్రత్యేక తరహాకు చెందింది. నేర్చుకునే విద్యార్థే స్వయంగా టీచర్‌గా మారేలా విభిన్నశైలిలో ఉంటుంది. తెలుగులో వివరణలు, ఉచ్ఛారణలు ఉన్నప్పటికీ ఇంగ్లీషును స్వతంత్రంగా అర్థం చేసుకోవడానికి, మాట్లాడటానికి ఎంతగానో దోహదపడుతుంది ఈ పుస్తకం.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good