ఇంగ్లీష్ ప్రపంచ బాష  మనం ఏ ఇతర ప్రదేశానికి వెళ్ళినా, ఆ ప్రదేశంలో మాట్లాడే భాష మని తెలియదు. ఒకరి బాషను ఇంకొకరు అర్ధం చేసుకోలేరు. కాబట్టి ఇద్దరికీ అర్ధమయ్య అనుసంధాన భాష ఒకటి అవసరం అవుతుంది. ఆ కొరత ఇంగ్లీష్ బాష తీర్చింది. చాల దేశాల వారు ఇంగ్లీష్ బాష నేర్చుకుంటున్నారు.  వర్తకానికి గాని, వ్యాపారానికి గాని, శాస్త్ర విషయాల్ని తెలుసుకోవడానికి గాని ఇంగ్లీష్ బాష చాలా అవసరం. అనేక దేశాల శాస్త్రజ్ఞుల తమ పరిశోధలనన్నింటిని ఇంగ్లీష్ బాషలోనే భద్రపరిచారు. వాటిని గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లిష భాషా జ్ఞానం చాలా అవసరం. పరీక్షలలో ఉతీర్ణత సాధించడానికే కాదు. ఉన్నత పదవుల్ని సాదించదానికి కూడా భాషా తోడ్పడుతుంది. ఇంగ్లిష బాష ను నేర్చుకోవాలంటే దానికి పునాది అయిన గ్రామర్ నేర్చుకోవాలి. భాష ద్వారా భావాల్ని తెలియజేయడానికి సాధనం వాక్యం. వాక్యాన్ని నిర్మించ దానికి పదాలు అవసరం. పదాల్ని కూర్చడానికి అక్షరాలు కావాలి. ఏ అక్షరం ఎక్కడ ఉపయోగిస్తే భాషకి అందం వస్తుందో అర్ధం చేసుకోడానికి బాష ఉపయోగపడుతుంది. అంటే గ్రామర్ ఉపయోగ పడుతుంది. బాష అభివృద్దికి పదజాలం, వస్తువులతో పరిచయం, పర్యాయ పదాలు - వ్యతిరేక పదాలు, కర్తని, కర్మని ప్రయోగాలు, పేరాలు, కధలు,ఉత్తరాలు, వ్యాసాలు, మొదలైన వాటిని అలంకారాలతో, జాతీయాలతో రాయడం , ఒక్కక దశకు చాలా అభ్యాసాలు కూడా ఇవ్వడం జరిగింది. శ్రద్దగా చదివి, అర్ధం చేసుకుని, అభ్యాసాలు చేస్తే ఇంగ్లిష బాష లో ప్రావీణ్యం సంపాదించగలరు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good