మానవ సమాజంలో పనిచేసే గతితార్కిక సూత్రాలే ప్రకృతిలో కూడా పని చేస్తాయని ప్రకృతి శాస్త్ర పరిశోధనలు ఎలా రుజువు చేసిందీ ఏంగెల్స్‌ ఈ గ్రంథంలో వివరిస్తాడు. ఈ గ్రంధంలోని వివిధ అధ్యాయాలు శాస్త్ర విజ్ఞాన చరిత్ర, విశ్వం మార్పు లేనిదన్న పాత భావన స్థానంలో విశ్వపరిణామం సిద్ధాంతం ఎలా చోటుచేసుకున్నదో, పరిమాణాత్మక మార్పు నుండి గుణాత్మక మార్పు ఎలా సంభవిస్తుందన్న విషయం, అలాగే చలనం యొక్క ప్రాథమిక స్వరూపాలు, చలనం, కొలత, ఉష్ణ - పదార్థ చలనంల గురించి గతితార్కిక అవగాహనను వివరిస్తాయి. మర్కటం నుండి మానవ రూపుకి పరివర్తనలో శ్రమపాత్ర అనే అధ్యాయం ఎంతో ప్రాధాన్యతను కలిగి మానవ స్వభావం, అభివృద్ధిల గురించిన మార్కిస్టు దృక్పధాన్ని వివరిస్తుంది. అలాగే ప్రకృతి శాస్త్రం - ఆధ్యాత్మిక ప్రపంచంల గురించిన ఏంగెల్స్‌ అంచనాలను కూడా తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యుత్‌ - పవన పీడనాలను గురించి వివరించే అధ్యాయాలు నేటి విజ్ఞాన శాస్త్రంతో పోలిస్తే కేవలం చరిత్రగా మాత్రమే ప్రాధాన్యత కలిగిన అంశాలు మాత్రమే. ఇక 'నోట్స్‌'గా ఇవ్వబడిన సుదీర్ఘమైన అధ్యాయాలు అత్యధిక ప్రయోజనం కలిగినంటివి. శాస్త్ర విజ్ఞాన చరిత్ర, శాస్త్ర విజ్ఞానతత్వం, గతితార్కిక సూత్రాలు, ప్రత్యేక శాస్త్రాలకు సంబంధించిన అంశాలు దీనిలో ఉన్నాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good